![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -163 లో... కనకం, కృష్ణమూర్తి ఇద్దరు లు సేట్ కి డబ్బు ఎలా ఇవ్వాలని బాధపడుతుంటారు. ఎలాగైనా ఈ ఇల్లు అమ్మి అడ్వాన్స్ గా వచ్చిన డబ్బులు సేట్ కి ఇవ్వాలని కృష్ణమూర్తి అంటాడు. ఆ మాటలు అప్పు విని.. నాన్న ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అమ్మనివ్వద్దు, ఎలాగైనా రేపు యాభై వేలు ఏర్పాటుచేయాలని అనుకుంటుంది.
మరొకవైపు కావ్య, రాజ్ ఇద్దరు ఆఫీస్ లు ఆఫీస్ కి వస్తారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి శృతి వచ్చి.. థాంక్స్ మేడమ్ సర్ నిజం చెప్పి నాకు టెన్షన్ తగ్గించారని శృతి అంటుంది. నా దగ్గర అబద్ధం చెప్తావా, నిన్ను డిజైనర్ పోస్ట్ నుండి అసిస్టెంట్ డిజైనర్ పోస్ట్ కి చేంజ్ చేస్తున్నానని రాజ్ అంటాడు. ఆ తర్వాత క్లయింట్ వచ్చారుంటూ కావ్యని రాజ్ తీసుకొని వెళ్తాడు. క్లయింట్ తో ఎలా మాట్లాడాలో కావ్యకి రాజ్ చెప్పగా.. నాకెలా మాట్లాడాలో తెలుసని కావ్య అంటుంది. మరొకవైపు అప్పు డల్ గా కూర్చొని ఉంటుంది. కళ్యాణ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అప్పుడే అప్పు ఫ్రెండ్ వచ్చి.. నువ్వు అడిగిన డబ్బులు అడ్జస్ట్ కాలేదని చెప్తాడు. సరే అని అప్పు అంటుంది.
అది విన్న కళ్యాణ్.. అప్పు నా సాయం తీసుకోకూడదని అనుకుంటున్నావా అని అంటాడు. మన మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇలా డబ్బులు వద్దని అప్పు అంటుంది. మరొక వైపు రాజ్, కావ్య దగ్గరికి క్లయింట్స్ వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి డిజైన్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటాయని కావ్య చెప్తుంది. అందుకు మీకు హెల్ప్ చేస్తాను డిజైన్స్ కూడా నేను వేస్తానని క్లయింట్స్ కి చెప్పగానే.. మాకు మంచి సపోర్ట్ దొరికిందని వాళ్ళు అనుకొని, ఈ కాంట్రాక్ట్ మీ కంపెనీకి ఇస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కావ్యకి రాజ్ థాంక్స్ చెప్తాడు.
మరొకవైపు కనకం, కృష్ణమూర్తి వాళ్ళ ఇంటిని అమ్ముతున్నాడని తెలిసి.. ఒకతను వచ్చి ఇంటిని చూస్తాడు. ఇల్లంతా చూస్తూ ఇదేంటి ఇలా ఉందని కృష్ణమూర్తిని అవమానిస్తాడు. అంతే కాకుండా ఇల్లు ఉన్న విలువ కంటే తక్కువకి ఇల్లు కొంటానని, మీరే అలోచించుకోండని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. మరొక వైపు రాజ్ , కావ్య ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. కావ్యని కళ్యాణ్ పక్కకు పిలిచి.. మీ ఫ్యామిలీ ఇలా ప్రాబ్లెమ్స్ లో ఉందని, వాళ్ళ సిచువేషన్ కావ్యకి చెప్తాడు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని రాజ్ అనుకుంటాడు. కాసేపటికి రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |